శ్రీశైలంలో కృష్ణమ్మ పరవళ్లు-భారీగా వరద ప్రవాహం
శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం పెరుగుతోంది. దీనితో ఏకంగా 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీనితో కృష్ణమ్మ చూపరులకు కనువిందు చేస్తూ పరవళ్లు తొక్కుతోంది. స్పిల్ వే ద్వారా 3,17,940 క్యూసెక్కుల వరద నీరు విడుదల అవుతోంది. ఎగువ ప్రాంతాలైన జూరాల, సుంకేసుల నుండి వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.50 అడుగులకు చోరుకుంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 60 వేల క్యూసెక్కుల నీటిని సాగర్‌లోకి కిందకి విడుదల చేస్తున్నారు.

