వైసీపీ నేత కొడుకు వీరంగం
ముప్పల సచివాలయంలో వైసీపీ నేత కొడుకు కోటిరెడ్డి వీరంగం సృష్టించాడు. సచివాలయంలోని కంప్యూటర్స్ , ప్రింటర్స్ ధ్వంసం చేస్తూ , సిబ్బందిపై దౌర్జన్యం చేసేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడే ఉన్న లేడి కానిస్టేబుల్ అతనిని వస్తువులను ధ్వంసం చేస్తుండగా అడ్డుకోవడంతో ఆమెపై దురుసుగా ప్రవర్తించాడు. దీనిని ప్రతిఘటించిన మహిళ కానిస్టేబుల్ , కోటిరెడ్డికి చెంప దెబ్బలతో బుద్ధి చెప్పింది. ఈ దృశ్యాలను సెల్‌ఫోన్ ద్వారా రికార్డ్ చేసిన సచివాలయ సిబ్బంది ఫిర్యాదుతో కోటిరెడ్డిపై పోలీసులు కేసు నమోదుచేసారు.

