జాన్వీకపూర్ తో జత కట్టనున్న జూనియర్ ఎన్టీఆర్ ?
కొరటాల సినిమా అంటే మంటలే. అందులోనూ జూనియర్ ఎన్టీఆర్ తో అంటే ఇక బీభత్సమే. బాక్సాఫీస్ బద్దలే. జనతా గ్యారేజ్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమాకు ప్లాన్ జరుగుతోంది. కథలో భిన్నత్వం. టేకింగ్ లో కొత్త స్టైల్ .. కథనంలో విభిన్న తీరు అన్నీ కలిస్తే కొరటాల. ఇప్పటికే త్రిబుల్ ఆర్ సినిమాతో తన రేంజ్ పెంచుకన్న యంగ్ టైగర్ ఇప్పుడు కొరటాల దర్శకత్వంలో నటించబోతున్నాడు అన్నది హాట్ టాపిగ్గా మారింది. తన 30 చిత్రాన్ని కొరటాలతో చేసేందుకు ఇప్పటికే జూనియర్ గ్రీన్ సిగనల్ ఇచ్చేశాడు. కథ కూడా నచ్చి ఓకే చెప్పేశాడట జూనియర్ ఎన్టీఆర్. స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పక్కన అందాలొలికంచే నటి కోసం అన్వేషిస్తున్నారట కొరటాల.

ఇప్పటికే కొంత మంది హీరోయిన్ల పేర్లను పరిశీలించినప్పటికీ .. ఎవరిని తీసుకోవాలి అన్నది తేలలేదు. అయితే శ్రీదేవి కుమార్తె జాన్వీ కుపూర్ ను ఎంపిక చేసే అవకాశం ఎక్కువగా ఉందని టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కథ విషయంలో కూడా కొన్ని మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. జాన్వీ కపూర్ – జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే ఇక అందానికి అందం.. యాక్షన్ కి యాక్షన్. అభిమానులకు కన్నుల పంటే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

