సినీ ఇండస్ట్రీపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
సినిమా ఇండస్ట్రీపై సీనిమాటోగ్రాఫ్ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాటోగ్రాఫ్ మంత్రిగా ఎన్నికైన తర్వాత సినిమా రంగం నుండి దిల్ రాజు తప్ప మిగిలిన వారు ఎవ్వరూ తనకు ఫోన్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా ఇండ్రస్ట్రీపై తనకు వారం రోజుల్లో నివేదిక కావాలని, సినిమా రంగంలో ఏం జరుగుతోందో తనకు తెలియాలని తన సెక్రటరీని ఆదేశించానన్నారు. దిల్ రాజు అమెరికా పర్యటనలో ఉండడం వల్ల కలవలేకపోయామని, ఆయన వచ్చాక సినీ ప్రముఖులంతా కలిసి, మంత్రిని కలుద్దామనుకున్నామని పేర్కొన్నారు సిని ఇండస్ట్రీ వారు. అందుకే విడివిడిగా, వ్యక్తిగతంగా ఎవ్వరూ కలవలేదని పేర్కొన్నారు.