Home Page SliderTelangana

విక్టరీ దిశగా దూసుకెళ్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్

తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కోమటిరెడ్డి బ్రదర్స్ ‘అదుర్స్’ అనిపిస్తున్నారు. కాగా ఇరువురు అసెంబ్లీ ఫలితాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏకంగా 40 వేల మెజార్టీతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా 8 వేల మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి పాలయ్యారు. కాగా ఇటీవల జరిగిన మునుగోడు ఉపఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఓటమి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈసారి వీరిద్దరు ముందంజలో కొనసాగుతూ విక్టరీకి దగ్గరగా ఉన్నట్లు కన్పిస్తోంది.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి బీజేపీ పార్టీలోకి మారడంతో అక్కడ ఉపఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఉపఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.