రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కొలుసు పార్థసారధి
రాష్ట్ర మంత్రిగా కొలుసు పార్థసారధి ప్రమాణస్వీకారం చేశారు. కొలుసు పార్థసారధి యాదవ్ కృష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి YSRCP తరపున ప్రాతినిధ్యం వహించారు. 2004, 2009, 2019లో మూడు పర్యాయాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. 2004లో మొదటసారి వుయ్యూరు నియోజకవర్గం నుండి, 2009, 2019లో పెనమలూరు నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ముందు పార్థసారథి తెలుగుదేశం పార్టీలో చేరి నూజివీడు నుంచి విజయం సాధించారు. వైఎస్ మంత్రివర్గంలో పశుసంవర్ధక, డెయిరీ డెవలప్మెంట్, ఫిషరీస్, వెటర్నరీ యూనివర్సిటీలకు మంత్రిగా పనిచేశారు. పార్ధ సారధికి సెకండరీ ఎడ్యుకేషన్, ప్రభుత్వ పరీక్షలు మరియు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పోర్ట్‌ఫోలియో నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సెకండరీ ఎడ్యుకేషన్‌కు చివరి మంత్రి.

