యువ క్రికెటర్‌తో కోహ్లి గొడవ..
ఆస్ట్రేలియా-భారత్ బాక్సింగ్ డే టెస్ట్ ఆటలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మెల్బోర్న్లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఈ ఆటలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి, ఆస్ట్రేలియా టీమ్‌లో కొత్తగా ఆరంగేట్రం చేసిన 19 ఏళ్ల యువ క్రికెటర్ కాన్స్టాస్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాన్స్టాస్ నడిచి వస్తుండగా విరాట్ తన భుజంతో డాష్ కొట్టాడు. దీనితో ప్రశ్నించిన కాన్స్టాప్తో వాగ్వాదం పెట్టుకున్నాడు కోహ్లి. ఈ విషయంలో ఉస్మాన్ ఖావాజా, అంపైర్ జోక్యం చేసుకోవడంతో నెమ్మదిగా ఈ గొడవ సద్దుమణిగింది. ఈ ఘటన జరిగాక కాన్స్టాప్ మరింతగా చెలరేగి ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 65 బంతులలో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టి 60 పరుగులు చేసి, ఔటయ్యాడు. విరాట్, కాన్స్టాస్లు ఢీకొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే కోహ్లి లాంటి ప్రపంచస్థాయి ఆటగాడు ఇలాంటి చర్యలకు దిగడం తప్పని కొందరు విమర్శిస్తున్నారు.