Home Page SliderNational

కోహ్లీ@లండన్

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ లండన్ వెళ్లినట్లు తెలుస్తోంది. నిన్న ముంబైలో టీమిండియా రోడ్ షో ముగిసిన తర్వాత కోహ్లీ లండన్‌కు బయలుదేరారు. కాగా ప్రస్తుతం కోహ్లీ భార్య అనుష్క,పిల్లలు లండన్‌లోనే ఉన్నట్లు సమాచారం. అయితే కోహ్లీ కుటుంబంతో సమయాన్ని గడిపేందుకు లండన్ వెళ్లినట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.కాగా కోహ్లీ టీమిండియా ప్రపంచ కప్ గెలిచిన అనంతరం ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయన అక్టోబర్‌లో జరిగే న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.