Home Page SliderNational

షమీ తల్లి ఆశీర్వాదం తీసుకున్న కోహ్లీ

భారత పాస్ట్ బౌలర్ మహ్మద్‌ షమీ తల్లి వద్ద విరాట్ కోహ్లీ ఆశీర్వాదాలను తీసుకున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోపీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ జట్టు గెలిచింది. అనంతరం విరాట్ నేరుగా షమీ తల్లి వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నాడు. తరువాత షమీ తల్లి, అతని కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగారు. కోహ్లీ ఎప్పుడూ పెద్దలను గౌరవిస్తాడు. తోటి ఆటగాళ్ల తల్లిదండ్రులను కలిసినప్పుడు వారి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకుంటుంటాడు. గతంలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ స్టేడియంలో తన చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Business offer: HITACHIతో జత కట్టిన MAKK FINSOL..అదనపు ఆదాయాన్ని ఇలా పెంచుకోండి..