మూడేళ్ల తర్వాత సెంచరీ చేసిన కోహ్లి
టీమిండియా ఫేవరెట్ స్టార్ విరాట్ కోహ్లి చాలా కాలం తర్వాత సెంచరీతో చెలరేగాడు. కోహ్లిపై సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లీకి ఇది తొలి సెంచరీ కాగా, మొత్తంగా 71వది. కోహ్లీ దెబ్బకు స్కోరు అలుపు లేకుండా పరుగులు పెట్టింది. ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించి మునుపటి కోహ్లీని చూపించాడు.

1,019 రోజులు లేదంటే అటు ఇటుగా మూడేళ్లు.. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ సెంచరీ చేయడానికి తీసుకున్న సమయమిది. ఆసియా కప్‌లో భాగంగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో చెలరేగిపోయి భారత్‌కు అత్యధిక స్కోర్‌ను అందించాడు. 53 బంతుల్లోనే సెంచరీ కొట్టిన కోహ్లీ.. మొత్తంగా 61 బంతుల్లో 12 ఫోర్లు, ఆరు సిక్సర్లతో అజేయంగా 122 పరుగులు చేశాడు.
కోహ్లి పై ప్రశంసల వర్షం
ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లిపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నిజమైన హీరోలు సైలెంట్‌గా వస్తారు… విమర్శించిన వారిపై మాటలతో కాకుండా పంచులతో సమాధానమిస్తారు. అచ్చం విరాట్ కోహ్లి లాగే. కంగ్రాట్స్.. మరోసారి వింటేజ్ కోహ్లిని తలపించావు అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆనంద్ మహేంద్ర చేసిన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


 
							