కోదండరామ్, అలీఖాన్‌లు ఎమ్మెల్సీలుగా నేడే ప్రమాణం…
TG: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా TJS అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్, అలీఖాన్ కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అసెంబ్లీలో వారితో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలోనే వీరిని నామినేట్ చేయగా ప్రతిపక్షమైన BRS హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నియామక గెజిట్‌ను హైకోర్టు కొట్టివేయడంతో ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టు నిన్న తీర్పును వెలువరించింది.