IPL కెప్టెన్సీపై కేఎల్ రాహుల్ సంచలన నిర్ణయం..
ఐపీఎల్ సీజన్ మొదలవబోతోంది. ఈ నేపథ్యంలో వివిధ జట్లు తమ తమ కెప్టెన్లను ప్రకటించే సమయం వచ్చేసింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో సైలంట్ కిల్లర్‌గా పేరు పొంది, ఎదుటి టీమ్స్‌ను చిత్తు చేసిన కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ బాధ్యతలు వద్దని, ఆటగాడుగానే కొనసాగుతానని తిరస్కరించారట. డీసీ యాజమాన్యం కెప్టెన్‌గా కేఎల్ రాహుల్, అక్షర్ పటేలలో ఒకరిని తీసుకోవాలని ఆలోచనలో ఉంది. రాహుల్ నిరాకరించడంతో కెప్టెన్సీ అక్షర్ పటేల్‌కు అప్పగించే అవకాశముంది. మెగా వేలంలో రాహుల్‌ను రూ.14 కోట్లకు, అక్షర్ పటేల్‌ను రూ.16.5 కోట్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.