సినిమాలపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో జరుగుతున్న తెలుగు మహా సభలలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన తెలుగు భాష ఔన్నత్యాన్ని గురించి మాట్లాడుతూ తెలుగు సినిమాల గురించి ప్రస్తావించారు. తెలుగు సినిమాలలో పేర్లు తెలుగులో ఉంటే బాగుంటుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అంతే కాక కోర్టు తీర్పులు, వాదనలు కూడా తెలుగులో ఉంటే బాగుంటుందని పేర్కొన్నారు. పిల్లలతో రోజూ బాల సాహిత్యం చదివించాల్సిన అవసరం ఉందని చెప్పారు. డిజిటల్ విభాగంలో తెలుగు భాష క్రోఢీకరించి భావి తరాలకు అందించాలని, మాతృభాష అభివృద్ధి, సంరక్షణకు దోహదం చేయాలని పేర్కొన్నారు. తెలుగును కనుమరుగు కాకుండా చూసుకోవాలని, బోధనా భాషగా ప్రాచుర్యంలోకి తేవాలన్నారు. మనం వాడుక భాషలో కూడా 70 శాతం ఆంగ్లంలో మాట్లాడుతున్నామని కేవలం 30 శాతం మాత్రమే తెలుగు మాట్లాడుతున్నామని పేర్కొన్నారు.

