సీఎం రేవంత్ సవాల్ ని స్వీకరించిన కిషన్ రెడ్డి
మూసీ ప్రక్షాళన అసాధ్యమని రూ.1.50లక్షల కోట్లు ఎక్కడ నుంచి తెస్తారని ప్రశ్నించిన బీజెపి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన సంగతి అందరికీ తెలిసిందే. దమ్ముంటే మూసీ పేదల నివాస ప్రాంతంలో నిద్రపోవాలని రేవంత్ సవాల్ చేయడంతో కిషన్ రెడ్డి సహా బీజెపి నేతలంతా శనివారం రాత్రి 7 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు మూసీ పేదల ప్రాంతంలో బస చేయనున్నారు.దీంతో సీఎం రేవంత్ డిఫెన్స్‌లో పడిపోయారా అన్న చర్చ మొదలైంది. మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని,ప్రక్షాళన పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొద్దంటున్నామని కిషన్ రెడ్డి వాదిస్తున్నారు.అయితే ఇన్ని లక్షల కోట్లు ఎక్కడ నుంచి తెస్తారో చెప్పాకే ప్రక్షాళన చేయమంటున్నామని కిషన్ రెడ్డి చెబుతున్నారు.అయితే బీజెపి ఓర్వలేకే ఇలా చేస్తుందని సీఎం విమర్శించి,దమ్ముంటే నిద్ర చేయాలని కోరడంతో ఇవాళ మూసీ తీరంలో నిద్ర కార్యక్రమానికి ఉపక్రమించబోతున్నారు.