నా ఇల్లు ఇండియా.. నా పేరు కిరణ్ కుమార్ రెడ్డి
బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పదవులు ఆశించి బీజేపీలో చేరలేదన్న కిరణ్ కుమార్ రెడ్డి… పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తే.. అవి నెరవేర్చుతానన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం, తాను సీఎంగా ఉన్నప్పటి కంటే ఎక్కువగా సాయం చేస్తోందన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. పార్టీకి తాను ఎక్కడ ఉపయోగపడతానంటే అక్కడ పనిచేస్తానని చెప్పుకొచ్చారు.
ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు తనవేనన్నారు. హైదరాబాద్‌లో పుట్టానన్న కిరణ్, అక్కడే విద్యాభ్యాసమంతా కొనసాగిందన్నారు. అక్కడ చదువుకొనే, అక్కడే ఉంటున్నానన్నారు. తండ్రిది చిత్తూరు జిల్లా వాయల్పాడని.. అక్కడ ఎమ్మెల్యేగానూ గెలిచానన్నారు. బెంగళూరులోనూ తనకు సొంత ఇల్లు ఉందని.. కర్నాటక కూడా తన సొంత రాష్ట్రమనుకోవచ్చన్నారు. మొత్తంగా తానో ఇండియన్ అని గొప్పగా చెప్పుకొచ్చారు. పార్టీ ఎక్కడ పనిచేయమంటే అక్కడకు వెళ్లి కష్టపడి పనిచేస్తానన్న కిరణ్.. పనిచేసుకుంటూ పోతే పదవులు వాటంతటవే వస్తాయన్నారు.