కిరణ్ అబ్బవరం కొత్త పాయింట్‌తోనే…
రాజావారు రాణివారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాలతో కిరణ్ అబ్బరం హీరోగా మంచి పేరు గడించాడు. ఈ టాలెంటెడ్ యాక్టర్ పాన్ ఇండియా స్టోరీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడన్న సంగతి తెలిసిందే. కిరణ్ అబ్బవరం నటిస్తోన్న తాజా చిత్రం క (KA). 1970 ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణగిరి గ్రామం నేపథ్యంలో సాగే పీరియాడిక్ థ్రిల్లర్ మూవీని సుజిత్-సందీప్ డైరెక్ట్ చేస్తున్నారు. లేటెస్ట్‌గా ఈ సినిమా వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ సాంగ్ లిరికల్ వీడియోను మార్కెట్‌లో విడుదల చేశారు. పోస్ట్‌మ్యాన్ వాసుదేవ్‌ది.. ఏ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ లేని ప్రయాణం.. అంటూ వాసుదేవ్ ప్రపంచం చుట్టూ సాగుతున్న ఈ పాట సినిమా ట్రాక్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చారు. కిరణ్ అబ్బవరం ఈసారి ఏదో ఒక కొత్త పాయింట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తోస్తోంది. ఈ మూవీలో 2018 ఫేం తాన్వి రామ్, గం గం గణేశా ఫేం నయన్ సారిక ఫిమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీకి శ్యామ్ సీఎస్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. కిరణ్ అబ్బవరం నుండి వస్తోన్న తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఎక్కువే…

