Home Page SliderInternational

క్యాన్సర్‌తో బాధపడుతున్న కింగ్ చార్లెస్, వెల్లడించిన బకింగ్‌హామ్ ప్యాలెస్

కింగ్ చార్లెస్, 75, ఒక ప్రత్యేక సమస్యను బాధపడుతున్న సమయంలో ఆస్పత్రిలో చేరగా… ఆయనకు పరీక్షల్లో క్యాన్సర్ సోకినట్టు తేలిందని ఆయన కార్యాలయం ప్యాలెస్ తెలిపింది. ప్రస్తుతం ఆయన రోజువారి విధులు నిర్వర్తించరని కూడా వెల్లడించింది. ఐతే త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో ఆయన రోజువారీ కార్యకలాపాలు ప్రారంభిస్తారని వైద్యులు తెలిపారు. కింగ్ చార్లెస్, ఒక ప్రత్యేక సమస్యను గుర్తించినప్పుడు విస్తరించిన ప్రోస్టేట్ సరి చేయడం కోసం వైద్యులను ఆశ్రయించారు. గత నెలలో ఆసుపత్రిలో మూడు రాత్రులు గడిపారు. పరీక్షల్లో క్యాన్సర్‌లో ఏదో ఒక రూపాన్ని వైద్యులు గుర్తించారు. ప్రోస్టేట్ విస్తరణతో ఆసుపత్రి వర్గాలు ఆందోళన కలిగించే ప్రత్యేక సమస్య గుర్తించారు. ఆ తర్వాత పరీక్షలతో ఆయనకు క్యాన్సర్ రూపాన్ని గుర్తించారు. కింగ్ చార్లెస్ త్వరగా కోలుకోవాలని UK ప్రధాన మంత్రి రిషి సునక్ ఆకాంక్షించారు. రాజు పూర్తి శక్తితో తిరిగి వస్తాడనడంలో సందేహం లేదు. దేశం మొత్తం ఆయనకు మద్దతుగా ఉంటుందని చెప్పారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ నాయకుడు కైర్ స్టార్మర్ మాట్లాడుతూ, “లేబర్ పార్టీ తరపున, ఆయన కోలుకోవాలని ఆకాక్షించారు. ఆయన త్వరగా పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని మేము ఎదురుచూస్తున్నాము.” అని చెప్పారు.