దక్షిణ కొరియాపై మరోసారి కిమ్ దూకుడు
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి దక్షిణ కొరియాపై కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు. దక్షిణ కొరియాను కలిపే రోడ్లను పేల్చివేసి, దూకుడు ప్రదర్శించాడు. దక్షిణ కొరియా డ్రోన్లు, తమ భూభాగంలో సంచరిస్తున్నాయని అరోపణలు చేశాడు. అందుకే శతఘ్ని దళాన్ని సరిహద్దుల వరకూ తరలించి, దక్షిణ కొరియాకు సంబంధించిన డ్రోన్ కనిపిస్తే కూల్చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు దక్షిణ కొరియా కిమ్ ఆరోపణలు ఖండించింది. తమ ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లితే తీవ్ర పరిణామాలుంటూయని హెచ్చరించింది. ప్రస్తుతం రెండు కొరియాల మధ్య రోడ్లు, రైల్వేలను పూర్తిగా మూసివేశారు.