పోలీసుల గెటప్‌లో వచ్చి కిడ్నాప్
ఏపిలో అధికార పార్టీ అరాచకాలు పెచ్చుమీరుతున్నాయని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ధ్వజమెత్తారు. ప్రజాగళం వినిపించే వైసీపి కార్యకర్తలను నిలువరించేందుకు చేయని అరాచకాలు,కుట్రలు లేవని మండిపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో యాక్టివ్‌గా ఉన్న వైసీపి నేతలను గుర్తుతెలియని దుండగులు పోలీసుల వేషంలో వచ్చి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారన్నారు.ఈ మేరకు ఆయన కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. 8 మంది దుండగులు ఈ కిడ్నాప్‌లో పాల్గొన్నట్లు సీదిరి అప్పలరాజు ఆధారాలతో సహా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.అయినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకెన్నాళ్లు ఈ దౌర్జన్యాలు నారా చంద్రబాబు నాయుడు ,హోం మంత్రి అనిత ? అంటూ మీడియా ముఖంగా ఆయన ప్రశ్నించారు.