శవాలుగా తేలిన ఖాకీలు
ఏమైందో ఏమోగానీ మూడు ఖాకీలకు కష్టం వచ్చింది.అందరి కష్టాలు తీర్చే ఆ ముగ్గురు రక్షక భటులు అనంత లోకాలకు వెళ్లిపోయారు.దీనికి వారు ఎంచుకున్న మార్గం ఆత్మహత్య. అది అలాంటి ఇలాంటి సూసైడ్ కాదు…. కనీసం ఓ నెల రోజుల పాటు ఇన్వెస్టిగేషన్ చేస్తేగానీ ఆధారాలు కూడా లభించలేని ధ్రిలర్ సూసైడ్.అలాంటి ఆత్మహత్యకు పాల్పడింది ఓ కానిస్టేబుల్ , ఓ పిసి ఆపరేటర్, మరో ఎస్సై.బహుశా పోలీస్ హిస్టరీలో నే అతి దారుణాతి దారుణమైన డిఫికల్ట్ సూసైడ్ అనే చెప్పాలి.అలాంటి ఆత్మహత్య కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్‌లో జరిగింది. బుధవారం రాత్రి ఎల్లారెడ్డి చెరువు వద్ద వెలుగు చూసింది. బిక్కనూరు పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సాయికుమార్,కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్,బీబీపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శృతి ఈ ముగ్గురు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.అయితే ఇందులో ఎస్సై మృతదేహం లభించలేదు.అసలు ఎస్సై ఆత్మహత్య చేసుకున్నాడా లేదా వారిద్దరినీ చంపి పరారయ్యాడా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే చెరువు కట్ట మీద ఎస్సై కారు,షూ ఉండటంతో అతను కూడా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తొలుత నిఖిల్,శృతి మృతదేహాలను వెలికి తీయించారు. ఎస్పీ సింధు శర్మ ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

