ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో అజిత్‌తో కేజీఎఫ్-3?
ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సిరీస్ ఏ స్థాయిలో హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు కేజీఎఫ్-3 పై ప్రశాంత్ నీల్ దృష్టి పెట్టారు. అయితే ఇందులో హీరో యశ్ కాదు. తమిళ హీరో అజిత్‌తో ఈ సినిమాను తీయనున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయన అగ్రిమెంట్‌పై సంతకం చేశారని పేర్కొన్నాయి. సినిమా మొదలైతే ఆయన కెరీర్‌లో ఇది 64వ సినిమా కానుంది. మరోవైపు ప్రభాస్‌తో సలార్-2, ఎన్టీఆర్‌తో ఓ సినిమాను ప్రశాంత్ నీల్ పూర్తి చేయాల్సి ఉంది.

