Home Page Slidertelangana,

రుణమాఫీపై కీలక అప్‌డేట్

ఇంతవరకూ రుణమాఫీ కాని రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. వ్యవసాయ శాఖాధికారులు గత మూడునెలలుగా సేకరించిన రైతుల వివరాల నుండి తప్పులు సరిచేసి అర్హులైన వారికి ఈ రుణమాఫీని నవంబర్ 30 లోపు జమచేయనున్నట్లు తెలిపింది. ఇప్పటివరకూ 3 విడతల్లో రూ.2 లక్షల వరకూ రుణమాఫీ చేశామని, మిగిలిన వారికి ఈ నెలాఖరులోపు చేయబోతున్నట్లు తెలిపింది. రేషన్ కార్డులు లేకపోవడం, ఆధార్, బ్యాంకు ఖాతాలలో పేర్లు, నెంబర్లు తప్పుగా ఉండడం వంటి కారణాలతో కొందరికి రుణమాఫీ జరగలేదు. ఇలాంటి వారికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, వివరాలు సేకరించారు. రైతు భరోసా పథకంపై కూడా నిర్ణయం తీసుకుంటారని సమాచారం.