ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సిట్ అధికారులు నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరుపుతూ భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితుడు రాజ్ కసిరెడ్డి సూచనల మేరకు 12 బాక్సుల్లో భద్రపరిచిన రూ.11 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు.కేసులో ఏ-40గా ఉన్న వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారం ఆధారంగా శంషాబాద్ మండలంలోని కాచారం గ్రామంలో ఉన్న సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్‌లో సిట్ అధికారులు తనిఖీలు చేసి ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏ1 రాజ్ కెసిరెడ్డి ఆదేశాల మేరకు ఏ40 వరుణ్, ఏ12 చాణక్య ఈ రూ.11 కోట్లు దాచినట్లు సిట్ విచారణ సందర్భంలో అంగీకరించారు. 2024 జూన్‌లో ఈ మొత్తం దాచినట్లుగా అధికారులు గుర్తించారు. నిందితుల సమాచారంతో సిట్ అధికారులు హైదరాబాద్ నగరంలో పది ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు.