విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాదంలో కీలక కారణం
విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో ఆదివారం భారీ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఏకంగా 300 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలయ్యింది. ద్రవ ఉక్కు ప్రవహించే టీఎల్‌సీలో రంధ్రం పడి ఇది కింద పడిపోయింది. ఈ ఘటనలో కేబుల్స్ కాలిపోయి, ట్రాక్ కూడా దెబ్బతింది. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే ఇటీవలే రీఫ్రాక్టరీ లైనింగ్ చేసిన టీఎల్‌సీ 1,050 హీట్ల వరకూ పని చేయాల్సి ఉండగా, 500 హీట్లకే రంధ్రం పడిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, నిపుణులైన సిబ్బందితో పనులు చేయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.