Andhra PradeshcrimeHome Page SliderNews Alert

ప్రేమోన్మాది దాడి కేసులో కీలక విషయాలు..

 విశాఖలో ఒక ప్రేమోన్మాది ప్రేమించిన అమ్మాయి పెళ్లికి అంగీకరించలేదనే కోపంతో కత్తితో ఆమెపై, ఆమె తల్లిపై దాడి చేసిన కేసులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈ దాడిలో ఆమె తల్లి మృతి చెందగా, ఆమె తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతోంది. దీపిక, నవీన్‌లు ఇద్దరూ 4ఏళ్లుగా ప్రేమించుకున్నారని, పెళ్లి కూడా చేసుకుందానుకున్నారని తెలిసింది. అయితే విభేదాలు రావడంతో పెద్దల పంచాయితీతో విడిపోయారని తెలిసింది. ఇటీవల మళ్లీ నవీన్ పెద్దలతో రాయబారం పంపాడని, కానీ పెళ్లికి ఆమె తల్లి, ఆమె నిరాకరించారని, అతడు పని లేకుండా జులాయిగా తిరగడం వల్ల భవిష్యతులో ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో అంగీకరించలేదని సమాచారం. హైదరాబాద్‌లో ఉద్యోగం కోసం ఇంటర్యూకు ఆమె బస్సులో వెళడానికి సిద్దమవుతుండగా, ఈ దారుణం జరిగింది. అతడిని సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా శ్రీకాకుళం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.