Andhra PradeshHome Page Slider

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం

ఏపీలో అసంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఈ రోజు సీఎం జగన్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది.కాగా ఈసారి సీటు రాదని తేలడంతో పలువురు ఎమ్మెల్యేలు సీఎంని కలిసే పనిలో ఉన్నట్లు సమాచారం.ఈ మేరకు చింతలపూడి,పిఠాపురం,జగ్గంపేట,ప్రత్తిపాడు,గుంటూరు వెస్ట్ ఎమ్మేల్యేలు ఇప్పటికే సీఎం క్యాంపు ఆఫీసుకు చేరుకున్నారు.కాగా మంత్రి చెల్లుబోయిన వేణు కూడా క్యాంపు కార్యాలయానికి  చేరుకున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు ఎంపీ భరత్ కూడా సీఎం జగన్‌ను కలిశారు. ప్రస్తుతం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపై ఫోకస్ చేయాలని వైసీపీ భావిస్తోంది.అయితే ఇవాళ వైసీపీ సెకండ్ ఫేజ్‌లో మార్పులు,అభ్యర్థుల కసరత్తు వంటి కీలక అంశాలపై సీఎం జగన్ ఎమ్మేల్యేలతో చర్చించనున్నారు.