ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం..
తెలంగాణలో తీవ్ర సంచలనం కలిగించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు నుండి తప్పించుకుంటూ అమెరికాలో ఉంటున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు, మరో కీలక నిందితుడు శ్రవణ్ రావులను రప్పించేందుకు సిట్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇంటర్ పోల్ ద్వారా ప్రయత్నిస్తున్న వారి ప్రయత్నాలు ఫలించాయి. వారికి రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయినట్లు ఇంటర్ పోల్ నుండి సీబీఐకి సమాచారం అందింది. అక్కడ నుండి తెలంగాణ సీఐడీకి కూడా సమాచారం అందింది. దీనితో వారిని రప్పించేందుకు మార్గం సులభమయ్యింది. ఈ దందాలో రాజకీయ నేతల ప్రమేయం ఉందని, ఆ ఆధారాలు బహిర్గతం కావాలంటే వారిని విచారించావల్సిన అవసరం ఉందని దర్యాప్తు బృందం పేర్కొంది.

