హెచ్‌సీయూ విద్యార్థులపై కేసులపై కీలక నిర్ణయం..
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హెచ్‌సీయూ విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించాలంటూ తెలంగాణ పోలీసులను ఆదేశించారు. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఇద్దరు విద్యార్థులకు సంబంధించిన కేసులను వెంటనే ఉపసంహరించాలని, న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీసులకు సూచించమని న్యాయశాఖ అధికారులను కూడా సూచించారు. నేడు జరిగిన హెచ్‌సీయూ టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ గ్రూప్స్‌తో మంత్రులు భట్టి, శ్రీధర్ బాబు, పొంగులేటి భేటీ అయ్యారు. ఈ భేటీలో కీలక విషయాలపై చర్చలు జరిపి ఈ నిర్ణయం తీసుకున్నారు.

