Home Page SliderPoliticstelangana,

తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం లగచర్ల భూసేకరణ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో వెనకంజ వేస్తూ భూసేకరణ కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంది. గత కొన్నాళ్లుగా జరుగుతున్న స్థానికుల ఆందోళన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి సొంత నియోజక వర్గమైన కొడంగల్‌లో ఇలాంటి ఆందోళనలు జరగడం దురదృష్టమని పేర్కొన్నారు. విపక్ష నేతలు ఆరోపిస్తున్నట్లు అక్కడ ఫార్మా విలేజ్‌ను ఏర్పాటు చేయడం లేదని, టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. అందుకే ఆ నోటిఫికేషన్ వెనక్కి తీసుకుంటూ తాజాగా టెక్స్‌టైల్స్ పార్కు కోసం మరో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుతో భూముల ధరలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.