స్కూల్ టైమింగ్స్ లో కీలక మార్పు రేపటి నుండి ఒంటిపూట బడులు!
తెలుగు రాష్ట్రాల్లో వేసవి ఎండలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో, ప్రభుత్వాలు స్కూల్ విద్యార్థుల కోసం కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో, విద్యార్థుల ఆరోగ్యం మరియు సౌకర్యం దృష్టిలో పెట్టుకుని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వం ఒంటిపూట బడులు అమలు చేయాలని నిర్ణయించాయి. ఈ సంఘటన విద్యార్థులకు, పాఠశాల సిబ్బందికి కొన్ని కీలక మార్పులపై అవగాహన ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో మార్పులు చేసుకుంటూ, మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. ఉదయం 8 గంటలకు పాఠశాలలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 12:30 గంటల వరకు మాత్రమే తరగతులు కొనసాగుతాయి. మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థులను ఇంటికి పంపించేస్తారు. పదో తరగతి విద్యార్థుల కోసం పబ్లిక్ పరీక్షలు సన్నద్ధతకు ప్రత్యేక తరగతులు నిర్వహించబడతాయి. పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న బడుల్లో మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు కొనసాగుతాయి.
ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎండల తీవ్రత పెరిగిపోవడంతో, మార్చి 15 నుంచి ఏప్రిల్ 24 వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 7:45 గంటలకు పాఠశాలలు ప్రారంభమవుతాయి. 12:30 గంటల వరకు తరగతులు కొనసాగుతాయి. పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న బడుల్లో మధ్యాహ్నం 1:15 గంటలు నుండి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించబడతాయి. ఏప్రిల్ 25 నుండి జూన్ 11 వరకువేసవి సెలవులు ఉంటాయి. జూన్ 12 నుండి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి.