ఉచిత గ్యాస్ సిలిండర్లపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉచిత గ్యాస్ సిలిండర్‌పై ఏపీ పౌరసరఫరాల శాఖమంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. కాగా ఎన్డీయే కూటమి ఎన్నికల హామీలకు కట్టుబడి ఉంటుందని ఆయన అసెంబ్లీలో వెల్లడించారు. ఈ స్కీమ్ అమలు చేయడానికి త్వరలోనే సంబంధిత శాఖలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా కేంద్రంతో కలిసి ఆ స్కీమ్ అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. కాగా ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఎన్డీయే కూటమి మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.