ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక నిందితుల అరెస్ట్..
ఏపీలో వేలకోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందంటూ కేసు నమోదయ్యింది. వైసీపీ పార్టీ హయాంలో ఈ కుంభకోణం జరిగిందనే ఫిర్యాదు మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక నిందితులుగా భావిస్తున్న సీఎంవో మాజీ కార్యదర్శి, మాజీ ఐఏఎస్ అధికారి కె. ధనుంజయరెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలను అరెస్టు చేశారు సిట్ అధికారులు. వారి ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేయడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరి అరెస్టుతో ఈ కేసులో మొత్తం కుంభకోణం సొమ్ము ఎవరికి చేరిందనేది తెలుస్తుందని సిట్ అధికారులు భావిస్తున్నారు. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుండి ముడుపులు, రాజా కెసిరెడ్డి మద్యం సరఫరా కంపెనీలపై ఆరోపణల నేపథ్యంలో వీరిని అరెస్టు చేశారు.