లోయలో పడిన కేరళ బస్సు
కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.70 అడుగుల ఎత్తైన లోయలో పడి కేరళ ఆర్టీసి బస్సు నుజ్జు నుజ్జయ్యింది.ఈ ప్రమాదంలో 4 గురు ప్రయాణీకులు దుర్మరణం పాలవగా, మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు.దిండిగల్ – కొట్టారకర జాతీయ రహదారిపై ఉన్న కొండల వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ఉన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.భద్రతా బలగాలు,పోలీసులు ,రెవిన్యూ,అటవీ శాఖ సిబ్బంది సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టారు. బ్రేకులు ఫెయిల్ అయిన కారణంగానే బస్సులోయలో పడినట్లు చికిత్స పొందుతున్న ప్రయాణీకులు తెలిపారు.
BREAKING NEWS: బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ ..ఇక మిగిలింది దంగల్..

