కేజ్రీవాల్ బెయిల్‌పై ట్వీట్ చేసిన సతీమణి
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు ఆరు నెలల అనంతరం బెయిల్ మంజూరు చేసింది. దీనిపై ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ స్పందించారు. భావోద్వేకంగా తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ధైర్యంగా, స్ట్రాంగ్‌గా నిలబడినందుకు ఆప్ ఫ్యామిలీకి శుభాకాంక్షలు. మిగిలిన ఆప్ లీడర్లంతా త్వరలోనే విడుదలవుతారని ఆశిస్తున్నట్లు ఆమె పోస్టు పెట్టారు.
ఈ కేసులో సుప్రీం కోర్టు ఇలా వ్యాఖ్యానించింది. “కొత్త సాక్షులు, నిందితుల పేర్లు ఉన్నందున, విచారణ సకాలంలో పూర్తయ్యే అవకాశం లేదు. బెయిల్ మంజూరు కోసం పిటిషన్ దారు షరతులను సంతృప్తిపరిచాడు” అని సుప్రీం కోర్టు తెలిపింది. అయితే, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుపై బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని అరవింద్ కేజ్రీవాల్‌ను ఆదేశించిన కోర్టు, మినహాయింపు ఇవ్వకపోతే ట్రయల్ కోర్టు ముందు జరిగే విచారణలకు హాజరు కావాలని కోరింది.

