Home Page SliderNational

ఈడీ నుండి సీబీఐ కస్టడీలోకి  కేజ్రీవాల్

ఢిల్లీ మద్యంకేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈడీ అదుపులో ఉన్న ఆయనను తాజాగా సీబీఐ కస్టడీకి కోరింది. కోర్టులో సీబీఐ అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసేందుకు అనుమతి కోరింది. న్యాయమూర్తి ఆదేశాలతో సీబీఐ అధికారులు తిహాడ్ కేంద్ర కారాగారం నుండి తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఆయన బెయిల్‌పై  ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది.