Home Page SliderNational

తల్లిదండ్రులను వీల్ చైర్‌లో పోలింగ్ బూత్‌కు తీసుకొచ్చిన కేజ్రివాల్…

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ ప్రారంభం కాగా.. ఉదయం 11 గంటల వరకు 19.95 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం ఆతిశీ, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సభ్యులతో కలిసి లేడీ ఇర్విన్ స్కూల్ పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేజ్రీవాల్ తల్లిదండ్రులను వీల్ చైర్ లో పోలింగ్ బూత్ కు తీసుకొచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరి భవితవ్యాన్ని తేల్చేందుకు మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 13,766 పోలింగ్ కేంద్రాలలో ప్రజలు ఓట్లు వేస్తున్నారు. ఈ నెల 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆ రోజే ఎన్నికల్లో పోటీ చేసే అగ్రనేతల భవితవ్యం తేలనుంది.