కీర్తి సురేశ్ పెళ్లి వేడుకలు షురూ..
డిసెంబర్ 12న టాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేశ్ వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోనీ తటిల్‌ను పెళ్లాడనుంది. కీర్తి సురేష్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి. తాజాగా ఈ ఫోటోలను తన ఇన్‌స్టా స్టోరీలో ఫోటోను షేర్ చేసింది. ఇరు కుటుంబాలు ఇప్పటికే వివాహం కోసం గోవాలో ల్యాండయినట్లు తెలుస్తోంది. హిందూ, క్రిస్టియన్ మతాల సంప్రదాయాలలో వీరి వివాహం చేసుకుంటారని సమాచారం. 12వ తేదీ ఉదయం హిందూ మత సంప్రదాయం, సాయంత్రం చర్చిలో క్రిస్టియన్ మత సంప్రదాయం ప్రకారం కీర్తి సురేష్, ఆంటోనీల వివాహం జరగనుంది. వీరి వివాహ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నట్లు సమాచారం.
