వైభవంగా కీర్తి సురేశ్ వివాహం
మహానటి కీర్తి సురేశ్ వివాహం గోవాలో వైభవంగా జరిగింది. ఆమె చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు ఆంటోనీని గోవాలోని ప్రముఖ రిసార్టులో హిందూ పద్దతిలో వేడుకగా వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు, సన్నిహితులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలను కీర్తి సురేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కొత్త జంటకు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నేటి సాయంత్రం వీరి వివాహం క్రిస్టియన్ పద్దతిలో జరగనుంది.


