కేసీఆర్ కామెడీ లిమిట్స్ దాటి పోతోంది
సీఎం కేసీఆర్ కామెడీ లిమిట్స్ దాటి పోతోందని బీజేపీ నాయకురాలు విజయశాంతి చెప్పారు. ‘ఎమ్మెల్యేలు వారి పార్టీ వాళ్లే. ఫామ్‌హౌస్ వారి ఎమ్మెల్యేకు చెందినదే.. బ్యాగుల్లో డబ్బులు చూపనే లేదు. బీజేపీతో సంబంధం లేని వ్యక్తులు.. ఇవన్నీ కేసీఆర్ తుగ్లక్ చర్యలే. మునుగోడుపై ఇంత భయం ఎందుకో పాగల్ పనులు చేస్తున్న కేసీఆర్‌కే తెలియాలి. ఎయిర్‌పోర్ట్ ట్యాగ్ ఉన్న బ్యాగ్‌లో పైసలెట్ల ఉంటాయి. అవాస్తవానికి ఇది అతి ప్రదర్శన. టీఆర్‌ఎస్ నాయకులు ఇన్ని గత్తరబిత్తర మాటలు చెప్పినా.. ప్రజలకు నిజాలు కూడా అర్ధమవుతూనే ఉన్నాయి’ అని విజయశాంతి స్పష్టం చేశారు.