బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ డుమ్మా
బడ్జెట్ సమావేశాలకు మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పాల్గొనలేదు. 2025-26 వార్షిక బడ్జెట్ ప్రసంగానికి ప్రతిపక్ష నేత గైర్హాజరయ్యారు. ఇటీవల గవర్నర్ స్పీచ్ కు సభకు వచ్చిన కేసీఆర్.. బడ్జెట్ ప్రసంగంతో పాటు చర్చలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఎర్రవల్లిలోని ఫాం హౌస్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ బీఆర్ఎస్ శ్రేణుల హడావుడి కూడా ఏం కనిపించకపోవడం గమనార్హం. అయితే ఈసారి బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ కచ్చితంగా హాజరవుతారని, చర్చల్లోనూ పాల్గొంటారని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

