Home Page SliderTelangana

కేసీఆర్ నీ టైం ముగిసింది: అమిత్ షా

నిజామాబాద్: పదేళ్లలో తెలంగాణ ప్రజలకోసం కేసీఆర్ ఏ పనీ చేయలేదని, కానీ తన కొడుకు కేటీఆర్ కోసం వేలాది కోట్ల రూపాయల అవినీతి మాత్రం చేశారని కేంద్రమంత్రి అమిత్ షా ఆరోపించారు. ఆర్మూర్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన సకల జనుల విజయ సంకల్ప బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తూ.. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలని కేసీఆర్ సర్కార్ నెరవేర్చలేదు. 2014లో దళితుణ్ణి సీఎంను చేస్తానని కేసీఆర్ మాటిచ్చి తప్పారు. కానీ, బీజేపీ బీసీని ముఖ్యమంత్రిని చేస్తుందని హామీ ఇస్తున్నా. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ స్థలాలను కబ్జా చేసింది. డబ్బులిచ్చిన వారినే మంత్రివర్గంలో కేసీఆర్ చేర్చుకునేవారు. అవినీతి కేసీఆర్‌ను గద్దె దింపాల్సిన అవసరం వచ్చింది. అవినీతి పరులందరినీ జైలుకు పంపే కార్యక్రమం బీజేపీ చేపట్టింది. ప్రజలారా బీజేపీ కమలం గుర్తుపై ఓటేసి గెలిపించ ప్రార్థన.