కేసీఆర్‌నే చేర్చుకోలేదు.. కవితను ఎలా చేర్చుకుంటాం..
ఢిల్లీ చుట్టూ తిరిగినా కేసీఆర్‌నే తమ పార్టీలో చేర్చుకోలేదని, కవితను ఎలా చేర్చుకుంటామని బీజేపీ తెలంగాణ ఛీఫ్ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. నిన్న జరిగిన టీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ చేసిన విమర్శలను బండి తిప్పికొట్టారు. కేసీఆర్‌లో భయం మొదలైందని ఆ పార్టీ నేతలే గుర్తించారన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్నవాళ్లను ఏ చెప్పుతో కొట్టాలన్నారు. కేసీఆర్ ముందస్తుకు వెళ్లనంటే.. వెళ్తారనే అర్థం. కేసీఆర్ పెట్టిన సమావేశంలో ఆయన మాటాలను విని మంత్రులు, ఎమ్మెల్యేలు నవ్వుకుంటున్నారన్నారు. కేసీఆర్ ఏ యుద్ధంకైనా మేం రెడీ అని అన్నారు. తెలంగాణలోనే టీఆర్‌ఎస్ కార్యకర్తలు లేరని.. దేశం మొత్తం ఎలా పోటీ చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ వ్యతిరేక శక్తులన్నీ బీజేపీకి మద్దతు తెలపాలన్నారు. రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని బండి పేర్కొన్నారు.