Breaking NewsHome Page Sliderhome page sliderNationalNewsNews AlertPoliticsTrending Todayviral

కేసీఆర్ ను వెయ్యి కొరడా దెబ్బలు కొట్టాలి

తెలంగాణకు కృష్ణా, గోదావరి నదీ జలాల్లో జరిగిన అన్యాయానికి ప్రధాన కారణం మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ , వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తన పాలనలో తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించారు. కృష్ణా జలాల పంపకంలో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలకే పరిమితమైన వాటాను నిర్ణయించడంలో కేసీఆర్ పాత్ర ఉందని పేర్కొన్నారు. ఇదే సమయంలో గోదావరి జలాలను రాయలసీమకు తరలించేందుకు జగన్‌కు సలహా ఇచ్చారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని రైతులు తాగునీరు, సాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వాల నిర్వాహక వైఫల్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. నీటి పంపకంలో జరిగిన అవినీతి వైఖరితో తెలంగాణ ప్రయోజనాలు పక్కనబడ్డాయని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని కేవలం ఒక టీఎంసీ అన్యాయంగా తగ్గించారని, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో పదిహేను టీఎంసీలతో ప్రాజెక్టులు ఆమోదించారని చెప్పారు. ఇది తెలంగాణ కు జరిగిన అన్యాయం అని కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్లే ఆంధ్రప్రదేశ్‌కు జలాలపై అధిక ప్రాధాన్యం లభించిందని ఆరోపించారు. ఈ వ్యవహారంలో తెలంగాణ కు కేసీఆర్ సీమాంధ్ర నేతల కంటే వెయ్యిరెట్లు ఎక్కువ ద్రోహం చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన నిర్ణయాలు తెలంగాణ రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయని విమర్శించారు. “కేసీఆర్ చేసిన నేరానికి వెయ్యి కొరడా దెబ్బలు కొట్టాల్సిందే” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది నేరుగా ప్రజల జీవితాలతో ఆటలాడిన చర్యగా అభివర్ణించారు. ఈ అంశంపై చర్చకు తాము సిద్ధమని, అవసరమైతే ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో మాక్ అసెంబ్లీ నిర్వహించడానికి తాను సైతం సిద్ధమని సీఎం రేవంత్ తెలిపారు. కేసీఆర్ ఆరోగ్యం సహకరించకపోతే తానే ఆయన వద్దకు వెళ్లి చర్చలో పాల్గొంటానని అన్నారు. అవసరమైతే మంత్రుల బృందాన్ని అక్కడికి పంపించి చర్చ జరిపేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ప్రజల హక్కుల విషయంలో తమ ప్రభుత్వం ఎలాంటి బెదిరింపులకు కూ తలొగ్గదని స్పష్టం చేశారు. కేటీఆర్ అసెంబ్లీలో చర్చకు పబ్లిక్‌గా సవాల్ చేస్తున్నప్పటికీ, కేసీఆర్ మాత్రం సభకు రావడం లేదని విమర్శించారు. నిజాయితీ ఉంటే చర్చకు రాకుండా ఎందుకు తప్పుకుంటున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీలో మాట్లాడేంత ధైర్యం లేదు, నిజాలు ఎదురైనా తట్టుకునే ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కృష్ణా, గోదావరి నదీ జలాల హక్కులు ఎట్టి పరిస్థితుల్లోనూ తాకట్టు పెట్టబోమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంతటి ఒత్తిడి వచ్చినా ప్రజల పక్షాన నిలబడతానని అన్నారు. “దేవుడే అడ్డు వచ్చినా ప్రజల హక్కుల కోసం పోరాడతాను” అని ధైర్యంగా ప్రకటించారు. ప్రజల ప్రయోజనాలే తమ ప్రభుత్వానికి ప్రథమ కర్తవ్యం అని ఆయన చెప్పారు.