Home Page SliderTelangana

కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: షర్మిల

YSRTP పార్టీ అధ్యక్షురాలు షర్మిల తెలంగాణా ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు. కాగా తెలంగాణాలో TSPSC పేపర్ లీకేజీ వ్యవహారం రాజకీయ రంగు పులునుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో TSPSC పేపర్ లీకులకు కారణం ఐటీ శాఖ నిర్లక్ష్యమేనని వైఎస్ షర్మిల ఆరోపించారు. దీనికి తెలంగాణా ఐటీ శాఖమంత్రి కేటీఆర్ పూర్తి బాధ్యత వహించాలని షర్మిల డిమాండ్ చేశారు.తెలంగాణాలో పేపర్ లీక్‌పై కేసీఆర్ ఇప్పటివరకు స్పందించకపోవడం దుర్మార్గమని షర్మిల పేర్కొన్నారు. నిరుద్యోగులకు మళ్లీ పేపర్ లీక్ కావనే గ్యారెంటీ కూడా ఇవ్వడం లేదన్నారు.   తెలంగాణాలో నిరుద్యోగులకు భరోసా కలిగేలా,ఉద్యోగాలు భర్తీ అయ్యేలా YSRTP తయారు చేసిన అఫిడవిట్‌పై KCR సంతకం పెట్టాలన్నారు. తెలంగాణాలో KCR హామి ఇచ్చిన విధంగా ఇంటికో ఉద్యోగం,నిరుద్యోగ భృతి ఇవ్వనందుకు క్షమాపణ చెప్పాలి అని షర్మిల ట్వీట్ చేశారు.