కేసిఆర్..నా భర్త, పిల్లలు ఎవరు రక్తం బొట్టు పడినా మీదే బాధ్యత.
ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున మేడ్చల్ షామీర్ పేట్‌లోని తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. కేసీఆర్, హుజూరాబాద్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని జమున ఆరోపణలు చేశారు. తన భర్త, పిల్లలు ఎవరి రక్తం బొట్టు పడినా కేసీఆర్‌దే బాధ్యత అన్నారు. తానెప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని, పరోక్షంగానే ఈటల రాజేందర్ కు అండగా ఉంటానని తేల్చి చెప్పారు. 20 కోట్లు పెట్టీ ఈటల రాజేందర్ ను చంపేస్తా అని కెేసిఆర్ అండతోనే ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చెప్తున్నారు. అది నీతో చంపించడానికేనా మేము ఉద్యమం చేసింది. ఆర్థికంగా కూడా అనేక ఇబ్బందులు పెడుతున్నారన్నారు. Mlc గా ఉండే నైతికత ఆయనకు లేదన్నారు. కెేసిఆర్ ఆయన్ను వెంటనే భర్తరఫ్ చెయ్యాలని డిమాండ్ చేశారు.

చిల్లర, పిచ్చి కుక్కను mlc చేసి హుజూరాబాద్ మీదకు కెసిఆర్ వదిలిపెట్టారు. గవర్నర్ ను తిడితే మండలించల్సింది పోయి కౌశిక్ రెడ్డికి పదవులు ఇచ్చారని ఎద్దేవా చేశారు. చెల్పుర్ సర్పంచ్ మహేందర్ గౌడ్ ను అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేసి.. పోలీసులతో కొట్టించారు.. దాన్ని వీడియో కాల్ చేసి మరి చూపించాలని ఒత్తిడి చేసిన రాక్షసుడు కౌశిక్ రెడ్డి అన్నారు. మహిళా ఉద్యోగుల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించారన్నారు. పంచాయితీ సెక్రటరీనీ యూజ్ లెస్ ఫెల్లో అని తిట్టారు. రైతును సిగ్గు లేదా అని తిట్టారు. రైస్ మిల్లులు దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు .

ఈటల రాజేందర్ ఏ పార్టీలో ఉన్న సంతృప్తిగా ఉన్నారని. ఆయన ప్రజలకోసమే పనిచేస్తారని పేర్కొన్నారు. మేం ఎప్పుడు పదవుల కోసం ప్రాకులాడ లేదు. కాళ్ళు మొక్కుడు మా రక్తంలో లేదన్నారు. ఈటల రాజేందర్ ప్రతిష్ఠ దిగజారింది, మెప్పు కోసం మాట్లాడబోతున్నారు అని వాట్స్ అప్ లో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కానీ ఈటల ప్రతిష్ఠ ఎప్పుడు దిగజారదని, ఈటల ఉద్యమ కారుడని, ఆయనను ప్రజలే కాపాడుకుంటారు అని ధీమా వ్యక్తం చేశారు.

