ఏపి గురించి కేసీఆర్ అన్నది నిజమే:చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణా సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను సమర్థించారు. ఇటీవల కేసీఆర్ మాట్లాడుతూ..హైదరాబాద్‌లో ఎకరం అమ్మితే ఏపీలో 100 ఎకరాలు కొనవచ్చు అని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను చంద్రబాబు సరైనవే అని వ్యాఖ్యానించారు. కాగా ఇప్పుడు ఏపీ పరిస్థితి అలానే ఉందని చంద్రబాబు విమర్శించారు. ఒకప్పుడు ఏపీలో ఎకరం అమ్మితే హైదరాబాద్‌లో నాలుగైదు ఎకరాలు కొనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది అన్నారు. అయితే దీనికి కారణం ఎవరు?జగన్ ప్రభుత్వం కాదా అని చంద్రబాబు ప్రశ్నించారు. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు,దోపిడి మీద మమకారం రాష్ట్రానికే శాపంగా మారాయి అని చంద్రబాబు మండిపడ్డారు.