హైకోర్టు తీర్పును కూడా కేసీఆర్ పట్టించుకోవట్లేదు…ఈటల
తెలంగాణ ముఖ్యమంత్రి హైకోర్టు తీర్పును కూడా పట్టించుకోవట్లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. రాష్ట్రంలో పదేళ్లుగా గెస్ట్ లెక్చరర్స్‌గా పని చేస్తున్న తమను రెన్యువల్ చేయాలంటూ కోర్టుకు వెళ్లిన వారిని అరెస్టు చేయించడం అమానుషం అన్నారు. అరెస్ట్ అయిన గెస్ట్ లెక్చరర్లను ముషీరాబాద్ పీఎస్‌లో కలిసి పరామర్శించారు ఈటల. అనంతరం మీడియాతో మాట్లాడారు. వారికి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ ప్రకారం వారిని రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. పర్మినెంట్ ఉద్యోగులు వచ్చే వరకు వీరిని కొనసాగించాలని హై కోర్ట్ తీర్పు ఇచ్చింది. దానిని అమలు చేయమని ఈరోజు వారు ధర్నా చేస్తే.. రాజ్యాంగం అమలు చేయాల్సిన సీఎం కోర్టు తీర్పును అమలుచేయమనీ కోరితే.. ఐదు వందల మంది గెస్ట్ లెక్చరర్లని అక్రమంగా అరెస్ట్ చేయించారు.

గెస్ట్ లెక్చరర్స్ గా పనిచేస్తున్న వారిలోఇంటర్ బోర్డులో 1654 మంది, డిగ్రీ కళాశాలలో 1940 మంది, మోడల్ స్కూల్స్ లో 1250 మంది, KGBV కాలేజీల్లో 1350 మంది, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ లలో 9600 మంది, మొత్తంగా 15794 మంది గెస్ట్ లెక్చరర్స్ పనిచేస్తున్నారు. వారందరికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు ముట్టడికి ప్రయత్నించిన వారిని అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని తక్షణమే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. సెలవులు వస్తే వారికి జీతాలు రావని, వారికి ఉద్యోగభద్రత కల్పించాలని, సంవత్సరానికి పన్నెండు నెలల జీతాన్ని ఇవ్వాలని పేర్కొన్నారు. కేసీఆర్‌కు తెలంగాణ భూములు కావాలని, ప్రజలు అక్కర్లేదని విమర్శించారు. వీఆర్‌ఏల వ్యవస్థపై ఉక్కుపాదం మోపి వారిని నిర్వీర్యం చేశారని, గ్రామ పంచాయితీ కార్యదర్శులకు ప్రొబేషన్ పీరియడ్ మూడేళ్లు పెట్టిందే కాకుండా ఇంకో ఏడాది పెంచి నాలుగేళ్లు చేయడం దుర్మార్గం అన్నారు. తెలంగాణ ప్రజలు ప్రేమకే లొంగుతారని, బెదిరిస్తే కాదని, ఉద్యోగులను పెట్టిన హింసలకు తప్పక ప్రతీకారం తీర్చుకుంటారని వచ్చే ఎన్నికలలో బీఆర్‌ఎస్ ఓడిపోవడం ఖాయమని విమర్శించారు.

నిన్న కెేసిఆర్ మాట్లాడుతూ.. కాళేశ్వరం కట్టిన డబ్బులు వెనక్కు వచ్చాయి అని పచ్చి అబద్ధాలు చెప్తున్నారు.
ప్రాణహిత చేవెళ్ల పేరుతో 16200 కోట్ల అంచనాతో మొదలైన ప్రాజెక్ట్ ను వారే 34 వేల కోట్లు చేశారు. కెేసిఆర్ వచ్చాక దాన్ని 84 వేల కోట్లు.. లక్ష కోట్లు చేశారు. కాళేశ్వరం వల్ల ఒరిగింది ఏమీ లేదు. దేవుడు కరుణించి మంచి వర్షాలు పడి భూగర్భ జలాలు పెరిగాయి తప్ప కాళేశ్వరం వల్ల కాదు.
కాళేశ్వరం మీద పెట్టిన డబ్బు మొత్తం తిరిగి వచ్చింది అని కెసీఆర్ చెప్తున్నారు. ఇది పచ్చి అబద్దం. వారి లెక్కల ప్రకారం కాళేశ్వరం కట్టినప్పటి నుండి ఇప్పటివరకు 155 టీఎంసీల నీటిని ఎత్తిపోసారు. 1 టీఎంసీ 10 వేల ఎకరాలు చొప్పున 150 టీఎంసీ ల నీటితో 600 కోట్ల రూపాయల పంట పండి ఉంచవచ్చు. కానీ మొత్తం డబ్బు వాపస్ వచ్చింది అంటే వినడానికి ఎడ్డోల్లామా? అంత అమాయకుల లెక్క కనిపిస్తున్నార ?
కాళేశ్వరం వల్ల పంటే పంట కంటే పెట్టే ఖర్చు ఎక్కువ అని ఆనాడే చెప్పాం. కరెంటు వాడినా వాడకపోయినా 3500 కోట్లు ఫిక్స్డ్ ఛార్జీలు కట్టాలి.కాళేశ్వరం అప్పు మన మనుమళ్లు కూడా కట్టాలి. కేసిఆర్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. అంటూ మండిపడ్డారు ఈటల.


 
							 
							