అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్: ఈటల రాజేందర్ నిప్పులు
కేసీఆర్ పెద్ద అబద్దాల కోరని… ప్రతి మాటలో అబద్ధం, ప్రతి పనిలో మోసముందన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే బీఆర్ఎస్ నేతలను ఊళ్లలోకి రానివ్వొద్దన్న ఈటల.. ఎక్కడిక్కకడే నిలదీయాలన్నారు. కేంద్ర పార్టీ ఆదేశాలతో కార్నర్ మీటింగ్ ద్వారా మీ దగ్గరకు వచ్చానన్నారు. పక్కనే ఉన్న హుజురాబాద్ నియోజకవర్గం, గురించి మీ అందరికీ తెలుసునన్న ఈటల… తెలంగాణ ఉద్యమంలో ఎలా పనిచేసిందీ వివరించారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గం సోమిడిలో బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్.

తెలంగాణ రాష్ట్రంలో మొదటి ఆర్థిక మంత్రిగా పనిచేశానన్న ఈటల, కరోనా కష్ట కాలంలో అందరూ ఇళ్లకే పరిమితమైతే ఆసుపత్రుల చుట్టూ తిరిగి… ప్రజల ప్రాణాలు కాపాడటంలో నా వంతు పాత్ర పోషించానన్నారు. కేసీఆర్ బయటికి వెళ్ళగొడితే హుజురాబాద్ ప్రజల ఆశీర్వాదంతో గెలిచి అసెంబ్లీకి వెళ్లానన్నారు. ఎన్నో సమస్యల గురించి మాట్లాడదామంటే రెండుసార్లు మెడలు పట్టి బయటికి గెంటారన్నారు. మొన్న అవకాశం వస్తే… ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేశానన్నారు. కానీ ప్రభుత్వ పెద్దలు తాను నిలబడిన వెంటనే మైక్ కట్ చేస్తున్నారన్నారు. సభలో కేసీఆర్ దొరికండని.. పేద ప్రజలకు కావాల్సిన ఎన్నో విషయాలను ప్రస్తావించానన్నారు ఈటల. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల బాకీ ఇవ్వాలని అడిగానన్నారు. ప్రభుత్వ ఇస్తానని చెప్పి.. నేటికీ ఇవ్వలేదన్నారు. యునివర్సిటీ మెస్ ఫీజులు పెంచుతానని ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదన్నారు.

వరంగల్‌లో రెండు రోజులు పడుకొని డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టి ఇస్తానని ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదన్నారు. ఎవరి జాగాలో వాళ్లు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు మూడు లక్షలు మాత్రమే ఇస్తానంటున్నాడని ఈటల విమర్శించారు. కేసీఆర్ ఇచ్చే డబ్బులతో పునాదులకైనా సరిపోతాయా? అని ఈటల ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ అబద్ధాలకోరు అవునో కాదో ఆలోచించాలన్నారు. పేదల కన్నీళ్లకు బీజేపీ పరిష్కారం చూపుతుందన్నారు. కేసీఆర్ నౌకర్లు ఇవ్వకపోగా… ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇవ్వలేదన్నారు. గొల్ల కురుమలకు 1 లక్ష 54 వేల రూపాయలు ఇస్తానని… మాట తప్పరన్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయినా, ప్రభుత్వ ఉద్యోగైనా, 50 ఎకరాలు ఉన్న ఆసామికైనా సరే గొల్ల కురుమల కుటుంబంలో పుడితే చాలు గొర్లు ఇస్తానన్నారు. ఇది కరెక్టేనా ? కనీసం పేదలకైనా ఇచ్చిండా? అని ఈటల కేసీఆర్‌ను ప్రశ్నించారు.

అబద్ధాలను కూడా తీయని మాటలతో చెప్పే మోసకారి అని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక… రైతులకు చేస్తానన్న రుణమాఫీ చేస్తామన్నారు ఈటల. ఉద్యోగాలు కల్పన, కళ్యాణ లక్ష్మి నగదును పెళ్లి మండపంలోనే ఇస్తామన్నారు. రెండు వేల రూపాయల పెన్షన్ వస్తుందని మురిసిపోతున్నారని… కానీ ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆలోచించాలన్నారు. బ్రాందీ షాపులలో బ్రాందీ కొనుక్కుంటేనే అన్నారు. తెలంగాణ వచ్చినప్పుడు పది వేల ఏడువందల కోట్లు ఉన్న లిక్కర్ ఆదాయం, ఇప్పుడు 45 వేల కోట్లకు చేరిందన్నారు. ఆదాయం నాలుగురెట్లు పెరిగిందన్నారు ఈటల. ఓట్లు కొనుక్కొని.. గద్దెమీద కూర్చొని.. అధికారం చలాయిస్తున్నారని కేసీఆర్‌పై ఈటల మండిపడ్డారు.

కేసీఆర్‌కి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించాలని ఓటర్లను ఈటల కోరారు. హుజూరాబాద్ ఒక్క నా నియోజకవర్గంలోని 4వేల కోట్లు ఖర్చు పెట్టారన్నారు. మన తలరాత మార్చే శక్తి మీ చేతుల్లోనే ఉందన్నారు ఈటల. ఓట్లు వేయకుండా వారి ఫీజులు గుంజేయాలన్నారు. కేసీఆర్‌తో కొట్లాడే శక్తి బీజేపీకి మాత్రమే ఉందన్న ఈటల… కమలం పార్టీని ఆశీర్వదించాలన్నారు. ప్రజలు కేసీఆర్ పాలన భరించలేని పరిస్థితిలోకి వచ్చారన్నారు. మోదీ అండదండలతో కచ్చితంగా న్యాయం చేస్తామని… మాట ఇవ్వడానికే వచ్చామన్నారు ఈటల. పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, రైతుబంధు ఏవీ కూడా పోవన్న ఈటల… సరైన సమయానికి అన్నీ అందిస్తామన్నారు.

