కరెప్షన్‌లో కేసీఆర్ ఫ్యామిలీ దేశంలోనే నెంబర్ 1-షర్మిల ఘాటు విమర్శలు
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు ఇవాళ గవర్నర్ తమిళిసైని కలిశారు. తన పట్ల, పార్టీ కార్యకర్తల పట్ల టీఆర్ఎస్ పార్టీ ఆగడాలను గవర్నర్‌కు ఏకరువు పెట్టారు. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రజాప్రస్థానం యాత్రను అడ్డుకునేందుకు కొన్నిరోజులుగా టీఆర్ఎస్ యత్నిస్తూనే ఉందన్నారు వైఎస్ షర్మిల. నర్సంపేటలో ఫ్లెక్సీలు తగులబెట్టారని… బస్సును తగులబెట్టారని… పార్టీ కార్యకర్తలను కొట్టారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేయాల్సిందిపోయి.. నన్ను అరెస్టు చేసి నా పాదయాత్రను ఆపాలని చూశారన్నారు. పాదయాత్రకు వస్తున్న రెస్పాన్స్ చూసి పతనమవుతామన్న ఉద్దేశంతో పాదయాత్రను అడ్డుకొని, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సృష్టించి అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకొచ్చారన్నారు. కేసీఆర్ గుండాలు వాహనాలను ఎలా ధ్వంసం చేశారన్నది చూపించేందుకు ప్రగతి భవన్ వెళ్లాలనుకుంటే… .పోలీసులు ఓవరాక్షన్ చేశారన్నారు షర్మిల. బండ్లను కేసీఆర్‌కు చూపించాలని ఇంటి వరకు తీసుకెళ్లాలన్న ప్రయత్నంలో పోలీసులు ఓవరాక్షన్‍తో అడ్డుకున్నారన్నారు. మహిళ అన్న ఇంగితం లేకుండా టో చేసుకుంటూ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారన్నారు.

పోలీస్ స్టేషన్లో పార్టీ కార్యకర్తలను ఇష్టానుసారం కొట్టారన్నారు. ట్రాఫిక్ సమస్య సృష్టించింది పోలీసులైతే.. తనపై కేసులు ఎలా పెడరాని షర్మిల ఎదురుదాడికి దిగారు. పోలీస్ బ్రూటాలిటీ ఘోరంగా ఉందన్నారు. పోలీస్ శాఖను షర్మిల హెచ్చరించారు. 8 గంటల పోలీస్ స్టేషన్లో కూర్చొబెట్టి రిమాండ్‌లో ఉంచుకోవాలని చూశారన్నారు. పాదయాత్రను ఆపాలని రిమాండ్‌కు ట్రై చేశారన్నారు. ట్రాఫిక్ వైలేషన్ కేసులో రిమాండ్‌కు ఎవరైనా అడుగుతారా అని ప్రశ్నించారు. జరిగిన విషయాలన్నింటినీ గవర్నర్ కు వివరించానన్నారు షర్మిల. కేసీఆర్ డిక్టేటర్, దొరలా పాలిస్తున్నాడని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదన్నారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేదని ప్రతి రోజూ ప్రశ్నిస్తున్నామన్నారు. కేసీఆర్ అవినీతిని ప్రశ్నించానన్నారు. రాష్ట్రంలో అవినీతి భయంకరంగా ఉందన్నారు. కేసీఆర్ కాంట్రాక్టర్ల ద్వారా లక్షల కోట్లు మింగిస్తే దోచుకుంటుంటే… బిడ్డ పేకాట స్కామ్, లిక్కర్ స్కామ్ అని వేల కోట్లు మింగితే.. కేటీఆర్, రియల్ ఎస్టేట్ అని ప్రతి ప్రాజెక్టులో వాటాలు తీసుకొని దోచుకుంటున్నారన్నారు. కేసీఆర్ కుటుంబం బినామీల పేరుతో లక్షల కోట్లు సంపాదించారన్నారు.

కేసీఆర్ కుటుంబం దేశంలోనే రిచెస్ట్ పొలిటిషియన్ ఫ్యామిలీ అయ్యిందన్నారు. రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పు చేశారన్నారు. కుటుంబం మాత్రం ఇష్టమొచ్చినట్టు అవినీతికి పాల్పడుతోందన్నారు. దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారన్నారు. కేసీఆర్ నివాసం ఉన్న ఇళ్లును రెయిడ్ చేస్తే కేసీఆర్, బిడ్డ, కొడుకు ఉన్న ఇళ్లు రెయిడ్ చేస్తే వేల కోట్లు దొరుకుతాయన్నారు షర్మిల. పాదయాత్రను ఎలాగైనా అడ్డుకోవాలని డిసైడయ్యారు. అన్నీ అధిగమించి పాదయాత్ర చేస్తామంటే… టీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి బెదిరిస్తున్నారన్నారు. మళ్లీ పాదయాత్ర చేసేందుకు కాలు పెడితే సత్తా చాటుతామంటూ బెదిరిస్తున్నారని షర్మిల దుయ్యబట్టారు. డబ్బులు సంపాదించుకోవడం తప్ప టీఆర్ఎస్ నేతలు చేస్తోందేంటని ప్రశ్నించారు. రెచ్చగొట్టడమంటే ఏంటో చెప్పాలన్నారు షర్మిల. భూకబ్డాలు చేశారని చెబితే అది రెచ్చగొట్టడమవుతుందా అన్నారు. రేపట్నుంచి తిరిగి పాదయాత్ర ఆరంభిస్తానన్నారు. పాదయాత్రలో నాకు, నా మనుషులకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత కేసీఆర్‌దేనన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులకు తెగబడితే అందుకు కేసీఆర్‌దే పూర్తి బాధ్యతన్నారు.

ఏమీ లేని వాళ్లు వందల కోట్లు ఎలా సంపాదించారన్నారని ప్రశ్నించారు షర్మిల. అవినీతి చేయకుండా ఎలా సంపాదించారో చెబితే ప్రజలు కూడా సంపాదించుకుంటారు కదా అన్నారు. ఎలా సంపాదించారో చెప్పే దమ్ము టీఆర్ఎస్ నేతలకు లేదా అంటూ ఎద్దేవా చేశారు. చెప్పుతో కొడతా అని ఒక్క నికృష్ట మంత్రిని మాత్రమే అన్నానన్నారు. మరదలా అంటే ఎవర్రా మరదలా అని ప్రశ్నించానన్నారు. ఎవరినీ ఏమీ అనకపోయినా… బూతులు తిట్టానని అభండాలు వేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రావాళ్లు వస్తున్నారు.. ఆంధ్రావాళ్ల పెత్తనమేంటంటున్నారు.. ఇక్కడ్నుంచి వెళ్లిపోవాలంటున్నారని.. ఇదేం సంస్కారమన్నారు. అసలు కేటీఆర్ భార్య ఎక్కడ్నుంచి వచ్చింది. ఆమె ఎక్కడి వారన్నారు షర్మిల. కేటీఆర్ భార్యను గౌరవించినప్పుడు మమ్మల్ని గౌరవించరా అంటూ దెప్పిపొడిచారు. తాను ఇక్కడే పెరగానన్న షర్మిల అబిడ్స్‌లో స్కూలు చదువు, మెహదీపట్నంలో కాలేజీకి వెళ్లాననన్నారు. ఇక్కడే పెళ్లి చేసుకొని… ఇక్కడే కొడుకు, బిడ్డను కన్నానన్నారు. నా బతుకు ఇక్కడే.. నా గతం ఇక్కడే.. నా భవిష్యత్ ఇక్కడే.. ఈ గడ్డకు సేవ చేయడం హక్కే కాదు.. బాధ్యత కూడా అన్నారు షర్మిల.
