Home Page SliderTelangana

13 నుండి కేసీఆర్ బస్సు యాత్రలు!

తెలంగాణ: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 13 నుండి కేసీఆర్ బస్సు యాత్రలు చేపట్టాలని యోచిస్తున్నారు. ప్రతి పార్లమెంట్ పరిధిలోని ప్రతి నియోజకవర్గానికి బస్సు యాత్ర చేస్తూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను కలిసి వారితో ముచ్చటించి, వారితో కలిసి వారి బాగోగులను తెలుసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుండి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల సమాచారం.